మళ్లీ నెగ్గిన నికోలస్ మాడురో

Mon,May 21, 2018 02:53 PM

Venezuelas President Nicol�s Maduro wins re election

కరాకస్: వెనిజులా దేశాధ్యక్షుడిగా నికోలస్ మాడురో రెండవసారి నెగ్గారు. మరో ఆరేళ్ల పాటు ఆయన దేశాధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించినా.. మాడురోనే మళ్లీ పగ్గాలు చేపట్టనున్నారు. ఎన్నికల్లో భారీ స్థాయిలో రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దేశవ్యాప్తంగా గత కొన్నాళ్లుగా ఆర్థిక సంక్షోభం ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజా జరిగిన ఎన్నికల్లో సుమారు 46 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థి హెన్రీ ఫాల్కన్ .. తుది ఫలితాలను తిరస్కరించారు. ఫలితాలపై నమ్మకం లేదని, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటివరకు సుమారు 90 శాతం ఓట్లను కౌంటింగ్ చేశారు. అందులో మాడురోకు 67.7 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎన్నికలను స్వేచ్ఛా వాతావరణంలో నిర్వహించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం మాత్రం ఎన్నికల ఫలితాలను తిరస్కరించింది. ఇది ప్రజాస్వామ్యానికి అవమానమని అమెరికా అభిప్రాయపడింది.

1257
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS