మాంసాహారులకన్నా శాకాహారులకే ఎక్కవ అఫైర్స్ ఉంటాయట!

Thu,May 31, 2018 06:44 PM

Vegetarians have more affairs than Non Vegetarians research says

కొంతమందికి వెజ్ ఆహారం అంటేనే ఇష్టం. మరి కొందరికి ముక్కలేనిదే ముద్ద దిగదు. అయితే.. ఆహారాల్లో వెజ్, నాన్ వెజ్ తేడా ఉన్నట్లే.. వాటిని తినేవాళ్లలో కూడా రకరకాలుగా ఉంటారట. అంటే.. మాంసాహారులకన్నా శాకాహారులకే ఎక్కువ అఫైర్స్ ఉంటాయట. అంతే కాదు.. శాకాహారులు మాంసాహారుల కంటే ముందుగానే శృంగారం అనుభూతిని పొందుతారట.

42 శాతం మంది వెజిటేరియన్స్ తమ పార్ట్‌నర్లతో నమ్మకంగా ఉండరు. నాన్‌వెజిటేరియన్స్‌లో ఇది 31 శాతంగా ఉంది. శాకాహారులకు తమ పార్ట్‌నర్ నచ్చకపోయినా, వాళ్ల దాంపత్య జీవితంలో ఏవైనా సమస్యలు వచ్చినా... నిర్మొహమాటంగా వాళ్లతో రిలేషన్‌షిప్ తెంచేసుకుంటారు.. అని ఓ సర్వేలో వెల్లడయింది.

1000 మంది మాంసాహారులు, 1000 మంది శాకాహారులతో కలిసి చేసిన సర్వే ఫలితాలే ఇవి. సర్వేను చేపట్టిన క్రిస్టియన్ గ్రాంటే ఏమంటాడంటే.. ఎవరితోనైనా అఫైర్ పెట్టుకున్నారంటే.. వాళ్లు ఖచ్చితంగా శాకాహారులే అయి ఉంటారు. ఎందుకంటే వాళ్లు ఇదివరకే వేరే వాళ్లను మోసం చేసి ఉంటారు. వెంటనే వేరే రిలేషన్‌షిప్ కోసం ప్రయత్నిస్తుంటారు. కాని.. మాంసాహారులు అలా కాదు.. అని అంటున్నాడు.

వీర్యవృద్ధిని పెంచడానికి కొన్ని కూరగాయలు, కొన్ని రకాల పళ్లు దోహదపడతాయని, అందుకే.. వాటిని వయాగ్రాలతో పోల్చుతారని సర్వే రీసెర్చర్స్ తెలిపారు. ఆకుకూరలు, ఫిగ్స్, మిరప, వెల్లుల్లి లాంటివి కామవాంచను పెంచుతాయని అధ్యయనంలో తేలిందని వాళ్లు పేర్కొన్నారు.

7771
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles