ఆ బర్గర్ ఖరీదు అక్షరాలా రెండు లక్షలు..!

Sat,February 10, 2018 03:44 PM

Valentine day special burger which is Worth 2 Lakhs

ఓ బర్గర్ ఖరీదు ఎంతుంటుంది. మా అంటే ఓ యాబై లేదంటే వంద సరే.. మెక్ డొనాల్డ్స్ లాంటి వాటిలో ఓ నుటయాబై లేదంటే రెండొందలు. కాని.. ఇప్పుడు నేను చెప్పబోయే బర్గర్ ధర ఎంతో వింటే మీ కళ్లు చెమరుస్తాయి. ఎందుకంటే.. ఆ బర్గర్ ఖరీదు అక్షరాలా రెండు లక్షల రూపాయలు. యూఎస్‌లోని మస్సాచుసెట్స్‌లో ఉన్న ఓ రెస్టారెంట్‌లో బర్గర్ ఖరీదు మూడు వేల డాలర్లట. అంటే మన కరెన్సీలో దాదాపు రెండు లక్షల రూపాయలు అన్నమాట.

ఇంతకీ.. ఆ బర్గర్‌ను ఏమైనా వజ్రవైడూర్యాలతో చేశారా ఏం? అని నోరెళ్లబెట్టకండి. ఎందుకంటే.. పైన తదాస్తు దేవతలు ఉంటారు. వాళ్లు తదాస్తు అని ఉంటారు. అందుకే ఆ బర్గర్‌ను నిజంగానే వజ్రవైడూర్యాలతో చేశారు. నమ్మబుద్ది కావట్లేదా? అయితే.. పైన ఉన్న ఫోటోను ఓ సారి పరికించి చూడండి మీకే అర్థమవుతుంది.

త్వరలో వాలెంటైన్స్ డే రాబోతున్నది కదా. అందుకే.. ప్రేమికుల కోసం మంచి గిఫ్ట్ తయారు చేయాలనుకున్న ఆ రెస్టారెంట్ ఇలా వినూత్నంగా ఆలోచించింది. ఆ బర్గర్ తో పాటు గోల్డ్, డైమండ్‌తో చేసిన ఎంగేజ్‌మెంట్ రింగ్ కూడా ఇస్తారన్నమాట. అయినా.. ప్రేమికుల రోజున.. ప్రేమికులు డబ్బు గురించి ఆలోచిస్తారా? వాళ్లకు నచ్చేలా గిఫ్ట్ తయారు చేస్తున్నాం. ఖచ్చితంగా.. ఆ బర్గర్‌ను ప్రేమికులు ఆదరిస్తారు అన్న విశ్వాసంలో ఉన్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. ప్రేమికుల రోజున ప్రేయసికైనా.. ప్రియుడికైనా అక్కడే ప్రపోస్ చేసి ఈ గోల్డ్ ప్లస్ డైమండ్ రింగ్‌ను తొడిగితే ఎలా ఉంటది.. అబ్బో ఆ కిక్కే వేరప్పా.. ఏమంటారు?

5177
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles