గ‌ర్భ‌స్రావంపై నిషేధం.. బిల్లుకు ఆమోదం

Wed,May 15, 2019 04:38 PM

US state Alabama passes bill banning abortion

హైద‌రాబాద్‌: అమెరికాలోని అల‌బామా రాష్ట్రం గ‌ర్భస్రావాన్ని(అబార్ష‌న్‌) నిషేధించింది. తాజాగా ఆ రాష్ట్ర ప్ర‌తినిధులు దీనికి సంబంధించి బిల్లును పాస్ చేశారు. అయితే ఆ బిల్లుకు కోర్టులో ఎదురుదెబ్బ త‌గిలే అవ‌కాశం ఉన్న‌ట్లు మ‌ద్ద‌తుదారులు అంటున్నారు. కానీ ఆ బిల్లుపై వేసిన అభ్య‌ర్థ‌న‌లు.. స‌మ‌స్య‌ను సుప్రీం వ‌ర‌కు తీసుకువెళ్తాయ‌ని భావిస్తున్నారు. 1973లో రూపొందించిన అబార్ష‌న్ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ప్ర‌భుత్వం తాజాగా బిల్లును ప్ర‌వేశ‌పెట్టింది. అమెరికాలోని మ‌రో 16 రాష్ట్రాలు కూడా గ‌ర్భస్రావంపై అద‌నంగా కొన్ని నిబంధ‌న‌లు జోడించాల‌ని భావిస్తున్నాయి. గ‌ర్భం ధ‌రించిన త‌ర్వాత ఎటువంటి ప‌రిస్థితుల్లోనైనా, ఏ ద‌శ‌లోనైనా అబార్ష‌న్(పిండాన్ని తొల‌గించ‌డం) చేసుకోకూడ‌ద‌న్న నిబంధ‌న‌తో కొత్త చ‌ట్టాన్ని రూపొందిస్తున్నారు. అబార్ష‌న్ చేసే డాక్ట‌ర్ల‌ను నేర‌స్తులుగా కూడా ప‌రిగ‌ణించ‌నున్నారు. వారికి 99 ఏళ్ల వ‌ర‌కు శిక్ష‌ను విధించాల‌ని నిర్ణ‌యించారు. కేవ‌లం త‌ల్లికి ప్ర‌మాదం ఉంద‌న్న కేసుల్లో మాత్ర‌మే అబార్ష‌న్ వీలుంటుంద‌న్నారు. రేప్ బాధితులు కూడా గ‌ర్భాన్ని తొల‌గించ‌రాద‌న్న మ‌రో నిబంధ‌న‌ను చేర్చారు. అబార్ష‌న్ చ‌ట్టాన్ని ఎత్తివేస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో డోనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే ఈ చ‌ట్టాన్ని ర‌ద్దు చేయాలంటే ట్రంప్ అనేక స‌వాళ్ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం సుప్రీంకోర్టులో ట్రంప్‌కు అనుకూలంగానే ఉన్న‌ది. తొమ్మిది మంది స‌భ్యులు ఉండే సుప్రీంలో.. ట్రంప్ నియ‌మించిన క‌న్జ‌ర్వేటివ్ జ‌డ్జిలు ఎక్కువే ఉన్నారు. 1973 నాటి తీర్పును ర‌ద్దు చేయాల‌న్న ఉద్దేశంతో క‌న్జ‌ర్వేటివ్‌లు ఉన్నారు. దీంతో ఇప్పుడు అల‌బామాలో అబార్ష‌న్‌పై నిషేధం విధించ‌డం ఓ సంచ‌ల‌నంగా మారింది.

2155
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles