చైనా ఉత్ప‌త్తుల‌పై సుంకాన్ని పెంచిన అమెరికా

Fri,May 10, 2019 12:51 PM

US raises tariffs on $200bn of Chinese goods

హైద‌రాబాద్: అమెరికా అన్న‌ట్టే చేసింది. చైనా ఉత్ప‌త్తుల‌పై భారీగా సుంకాన్ని పెంచింది. శుక్ర‌వారం నుంచి కొత్త టారీఫ్ అమ‌లులోకి వ‌స్తోంది. సుమారు 200 బిలియ‌న్ల డాల‌ర్ల విలువ చేసే చైనా ఉత్ప‌త్తుల‌పై.. అగ్రరాజ్యం అమెరికా నేటి నుంచి సుంకాన్ని ప‌ది శాతం నుంచి 25 శాతానికి పెంచేసింది. అయితే ఈ చ‌ర్య‌కు ప్ర‌తిచ‌ర్య త‌ప్ప‌దు అని చైనా కూడా ప్ర‌క‌ట‌న చేసింది. అమెరికా చ‌ర్య ప‌ట్ల విచారం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు చైనా వెల్ల‌డించింది. అయితే అమెరికా చేప‌ట్టిన సుంకం పెంపు చ‌ర్య‌పై ర‌క్ష‌ణాత్మ‌క చ‌ర్య‌లు చేపట్టాల‌ని చైనా తెలిపింది. అమెరికాకు దిగుమ‌తి అయ్యే చైనా ఉత్ప‌త్తుల‌పై సుంకాన్ని పెంచ‌నున్న‌ట్లు ఇటీవ‌ల ట్రంప్ ఓ ట్వీట్ ద్వారా వెల్ల‌డించారు. దాంతో రెండు అగ్ర‌రాజ్యాల మ‌ధ్య ట్రేడ్‌వార్ మొద‌లైంది. అయితే ఇవాళ్టి నుంచి పెంపు చేసిన సుంకం అమ‌లులోకి వ‌స్తోంది. మ‌రోవైపు వాషింగ్ట‌న్‌లో రెండు దేశాల‌కు చెందిన వాణిజ్య‌వేత్త‌లు విప‌త్క‌ర పరిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌త్యామ్నాయాల‌ను వెతుకుతున్నారు. అమెరికా త‌మ ఉత్ప‌త్తుల‌పై సుంకాన్ని పెంచిన‌ట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ‌శాఖ త‌న వెబ్‌సైట్‌లో తాజాగా పేర్కొన్న‌ది.

836
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles