ప్రజల మద్దతు వల్లే అమెరికా అధ్యక్షుడినయ్యా : ఒబామా

Wed,January 11, 2017 07:58 AM

అమెరికా : ప్రజల మద్దతు వల్లే అమెరికా అధ్యక్షుడిని అయ్యాయని బరాక్ ఒబామా స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్ష హోదాలో ఒబామా వీడ్కోలు ప్రసంగం చేశారు. ఇవాళ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపే రోజు అని పేర్కొన్నారు. ప్రతి రోజు ప్రజల నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నానని తెలిపారు. ప్రజలే తనను మంచి అధ్యక్షుడిగా, మంచి మనిషిగా తయారు చేశారన్నారు. సామాన్య ప్రజలు స్పందించినప్పుడే మార్పు సాధ్యమన్నారు. విశ్వాసం అంటే ఏంటో చికాగోలో నేర్చుకున్నానని తెలిపారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలన్నారు. అమెరికాలో పేదరికం తగ్గిపోయిందన్నారు. ప్రజల వల్లే అమెరికా శక్తివంతమైన దేశంగా ఎదిగిందన్నారు. మన దేశాన్ని ప్రత్యేకంగా నిలపుకునే సామర్థ్యం, శక్తి మనకు ఉందన్నారు. మరో పది రోజుల్లో అధికార మార్పిడి జరగనుందని చెప్పారు. అమెరికా ప్రస్తుతం ఉన్నతస్థానంలో ఉందన్నారు. జంటసౌధాలను కూల్చిన ముష్కరులను అంతమొందించామని గుర్తు చేశారు.

1205
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles