హోమ్‌ల్యాండ్‌ సెక్యూర్టీ మంత్రి రాజీనామా

Mon,April 8, 2019 01:04 PM

US Homeland Security Kirstjen Nielsen chief resigns

హైదరాబాద్‌: అమెరికా హోమ్‌ల్యాండ్‌ భద్రతాశాఖ మంత్రి క్రిస్టిన్‌ నీల్సన్‌ రాజీనామా చేశారు. దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేపట్టిన వివాదాస్పద సరిహద్దు విధానాల కోసం నీల్సన్‌ పనిచేశారు. హోమ్‌ల్యాండ్‌ సెక్యూర్టీ శాఖలో పనిచేయడం ఓ గర్వంగా భావిస్తున్నట్లు ఆమె చెప్పారు. నీల్సన్‌ స్థానంలో కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ కమిషనర్‌ కెవిన్‌ మెక్‌అలీనమ్‌ బాధ్యతలు స్వీకరిస్తారని డోనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. మెక్సికో సరిహద్దు వద్ద గోడ నిర్మించాలన్న ట్రంప్‌ విధానాన్ని నీల్సన్‌ సమర్థించారు. బోర్డర్‌ వద్ద పట్టుకున్న శరణార్థి కుటుంబాలను వేరు చేసింది కూడా ఈమే. అయితే ఎందుకు రాజీనామా చేశానన్న విషయాన్ని ఆమె తన లేఖలో వివరించలేదు. సరైన సమయంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ఇప్పుడు అమెరికా సురక్షితంగా ఉందని నీల్సన్‌ తెలిపారు. మెక్సికోతో బోర్డర్‌ను మూసివేస్తానని ఇటీవల తెలిపిన ట్రంప్‌ ఆ తర్వాత కొంత వెనక్కి తగ్గారు. మాదకద్రవ్యాలను, శరణార్థుల రవాణాలను నిలిపివేయాలని మెక్సికోకు వార్నింగ్‌ ఇచ్చారు.

999
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles