ఒంటెత్తు పోకడలను అమెరికా మానుకోవాలి: రష్యా

Fri,August 4, 2017 06:57 AM

US grand jury impanelled for Russia probe

మాస్కో: తమ దేశంపై అమెరికా ఆంక్షలు విధించడాన్ని రష్యా తప్పుబట్టింది. ఇది చాలా ప్రమాదకర విధానమని, తమపై చిన్న చూపులా ఉన్నదని పేర్కొన్నది. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకున్నదన్న ఆరోపణలతోపాటు ఉక్రెయిన్‌లోని క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించిందని పేర్కొంటూ రష్యాపై అమెరికా కఠినమైన ఆంక్షలు విధిస్తూ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లుపై బుధవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం రష్యా విదేశాంగశాఖ స్పందించింది. అమెరికా ఆంక్షల వల్ల ప్రపంచ సుస్థిరతకు భంగం వాటిల్లే ప్రమాదమున్నదని, దీనికి ఆ దేశమే బాధ్యత వహించాలని తెలిపింది. చట్ట విరుద్ధంగా తాము ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడలేదని ఇప్పటికే పలుసార్లు చెప్పామని, అయినా అమెరికా పట్టించుకోకుండా ఒంటెత్తు పోకడలతో ముందుకువెళ్తున్నదని పేర్కొంది. అమెరికా ఇలాగే వ్యవహరిస్తే తాము కూడా ప్రతీకారచర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించింది.

1021
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles