ఐఎస్ఐఎస్ క్యాంపుల‌ను ధ్వంసం చేసిన బీ-2 బాంబ‌ర్లు

Fri,January 20, 2017 01:22 PM

US bombs ISIS camps in Libya

న్యూయార్క్: అమెరికాకు చెందిన బీ-2 బాంబ‌ర్లు ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదుల‌ క్యాంపుల‌పై దాడి చేశాయి. లిబియాలో ఉన్న రెండు క్యాంపుల‌పై జ‌రిగిన దాడిలో సుమారు 80 మంది ఉగ్ర‌వాదులు మృతిచెందిన‌ట్లు అధికారులు తెలిపారు. యూరోప్‌లో దాడులు నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక‌లు వేస్తున్న ఉగ్ర‌మూక‌ల‌పై బాంబ‌ర్ల‌తో దాడి చేసిన‌ట్లు అమెరికా ర‌క్ష‌ణ కార్య‌ద‌ర్శి ఆష్ కార్ట‌ర్ తెలిపారు. ఈ మిలిట‌రీ ఆప‌రేష‌న్‌కు ప్రెసిడెంట్ బ‌రాక్ ఒబామా కొన్ని రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. ఆయుధాలు, సూసైడ్ బెల్టుతో ఉగ్ర‌వాదులు సంచ‌రిస్తున్న క్యాంపు ప్ర‌దేశాల‌పై బాంబ‌ర్లు దాడి చేసిన‌ట్లు అధికారులు చెప్పారు. దాడికి సంబంధించిన వీడియోల‌ను రిపోర్టర్లకు అమెరికా ర‌క్ష‌ణ‌శాఖ చూపించింది. 2011 త‌ర్వాత తొలిసారి మ‌ళ్లీ బీ-2 బాంబ‌ర్ల‌ను వినియోగించినట్లు అధికారులు చెప్పారు.

1430
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles