రెండు లక్షలు దాటిన హెచ్-1బీ దరఖాస్తులు

Fri,April 12, 2019 10:23 PM

US agency conducts H-1B visa lottery for 2 lakh applications

న్యూఢిల్లీ : ఈ ఏడాది హెచ్-1బీ వీసాల కోసం మొత్తం దాదాపు 2.10 లక్షల దరఖాస్తులు వచ్చాయని అమెరికా పౌరసత్వ, వలసదారుల సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్) ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే 2019-20 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 5 శాతం దరఖాస్తులు పెరిగాయని వెల్లడించింది. త్వరలో లాటరీ తీస్తామని తెలిపింది. నిబంధనల ప్రకారం అమెరికా ఏటా జనరల్ కోటా కింద 65,000 హెచ్1-బీ వీసాలు, మాస్టర్స్ కోటా పేరుతో అమెరికాలో ఎమ్మెస్ చేసిన విద్యార్థులకు మరో 20 వేల వీసాలను జారీ చేస్తూ ఉంటుంది. మొత్తం 85 వేల వీసాల కోసం ఈ ఏడాది 2.10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాది మొత్తం 1.90 లక్షల దరఖాస్తులు రాగా.. ఇందులో 95,885 మాస్టర్స్ కోటా కింద వచ్చాయి. లాటరీ విధానంలో వీసాలను కేటాయించనున్నారు. మాస్టర్స్ కోటా కింద వీసా రానివారికి మరోసారి జనరల్ కోటాలో అదృష్టం పరీక్షించుకునే అవకాశం ఉంటుంది. దీంతో మాస్టర్స్ కోటా దరఖాస్తులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఏడాది మాస్టర్స్ కోటా కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయో యూఎస్‌సీఐఎస్ అధికారులు వెల్లడించలేదు. కానీ.. దరఖాస్తుదారులకు వీసా వచ్చే అవకాశం 42 శాతం మాత్రమే ఉన్నదని పేర్కొన్నారు.

1151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles