స్మార్ట్‌ఫోన్‌ను మిక్సీలో వేసి రుబ్బాడు.. తర్వాత ఏం జరిగిందంటే?.. వీడియో

Fri,March 15, 2019 01:58 PM

University of Plymouth scientists blend phone for experiment

ఈయనకు ఏం పనిలేదా? స్మార్ట్‌ఫోన్‌ను మిక్సీలో వేసి రుబ్బడం దేనికి.. అని అంటారా? దానికి ఓ పర్పస్ ఉంది. ఇప్పుడు మనుషుల కన్నా స్మార్ట్‌ఫోన్లు ఎక్కువయ్యాయి. ఒక్కొక్కరి దగ్గర రెండు మూడు ఫోన్లు ఉంటున్నారు. అది కూడా కొన్ని రోజులే. కొన్ని రోజుల తర్వాత మళ్లీ కొత్త ఫోన్. మరి.. పాత వాటి సంగతి. ఇలా.. ఫోన్ల స్క్రాప్ పెరిగిపోతూ ఉంటే వాటిని ఏం చేసుకోవాలి. వాటిని రీసైకిల్ చేయొచ్చా? అసలు.. ఫోన్ లోపల ఏముంటుంది. వాటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఇదిగో ఇలాంటి డౌట్సే వచ్చాయి బ్రిటన్‌లోని ప్లయ్‌మౌత్ యూనివర్సిటీకి.

ఆ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు.. ఈ ప్రయోగాన్ని చేశారు. ఓ స్మోర్ట్‌ఫోన్‌ను తీసుకొని దాన్ని మిక్సీలో వేసి రుబ్బారు. దీంతో స్మార్ట్‌ఫోన్ కాస్త చిన్న చిన్న ముక్కలుగా మారింది. కొంచెం పొడి కూడా వచ్చింది. ఆ పొడిని తీసుకొని దాన్ని 500 డిగ్రీల సెల్సియస్ వేడిలో కరిగించి యాసిడ్స్ జత చేసి దాన్ని డిటెయిల్‌గా అనాలిసిస్ చేశారు.

అనాలిసిస్‌లో ఏం తేలిందంటే?


దాని అనాలిసిస్ ప్రకారం.. ఫోన్ పార్టికల్స్‌లో 33 గ్రాముల ఐరన్, 13 గ్రాముల సిలికాన్, 7 గ్రాముల క్రోమియం, 90 మిల్లీగ్రాముల సిల్వర్, 36 మిల్లీ గ్రాముల బంగారం కంటెంట్ ఉందట. అవే కాదు.. క్రిటికల్ ఎలిమెంట్స్ అయినటువంటి టంగ్‌స్టెన్ 900 మిల్లీగ్రాములు, 70 మిల్లీగ్రాములు కోబాల్ట్, మోలిబ్డెనమ్, 160 మిల్లీగ్రాముల నియోడైమియమ్, 30 మిల్లీగ్రాముల ప్రాసియోగైమియమ్ ఉన్నాయట. దీని ద్వారా ఫోన్‌లోని ఏ వస్తువును రీసైకిల్ చేయవచ్చు అని తెలుస్తుందని ఆ సైంటిస్టులు తేల్చారు.

దానికి సంబంధించిన వీడియో యూనివర్సిటీ తన ట్విట్టర్ ఖాతాలోనూ షేర్ చేసింది. అయితే.. ఆ వీడియోపై నెటిజన్లు తమకు నచ్చిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. అంతమాత్రానికి ఫోన్‌ను మిక్సీ పట్టాలా? మ్యానుఫాక్షరర్‌కు చెబితే.. లిస్ట్ ఇస్తాడు కదా అంటూ కొందరు కామెంట్లు చేశారు. అలా.. రకరకాలుగా వచ్చిన ట్వీట్లను మీరే చూడండి..

6050
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles