
లండన్: బ్రెగ్జిట్ ఒప్పందం బ్రిటన్ పార్లమెంట్లో వీగిపోయినప్పటికీ.. అవిశ్వాస తీర్మానం నుంచి థెరెసా మే గట్టెక్కింది. 19 ఓట్ల మెజార్టీతో కన్జర్వేటివ్ ప్రభుత్వం నెగ్గింది. 325 మంది ఎంపీలు థెరెసాపై అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయగా.. 306 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో లేబర్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అనంతరం బ్రెగ్జిట్ ఒప్పందంపై చర్చలకు రావాల్సిందిగా ప్రతిపక్ష నేతలను బ్రిటన్ ప్రధాని థెరెసా ఆహ్వానించారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై వీలైనంత త్వరగా నిర్ణయానికి రావాలని ఆమె పిలుపునిచ్చారు.