హనీమూన్ వెళ్లారు.. ఫుల్లుగా తాగారు.. హోటల్‌ను కొనేశారు..!

Thu,October 11, 2018 12:29 PM

UK Couple Gets Drunk On Honeymoon, Buys Hotel In Sri Lanka

తాగితే నిజాలు మాట్లాడతారంటూ కొందరు. తాగితే విశ్వరూపం ప్రదర్శిస్తారంటారు మరికొందరు. వీళ్లు మాత్రం ఫుల్లుగా తాగి.. వాళ్లు హనీమూన్ ట్రిప్‌కు వెళ్లిన హోటల్‌నే కొనేశారు. షాక్ అయ్యారా? అవును.. ఇది నిజం. నమ్మరా.. నమ్మించాలంటే మిమ్మల్ని శ్రీలంక తీసుకెళ్లాల్సిందే.

ఇది జరిగి చాలారోజులు అయినా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్రిటన్‌కు చెందిన ఓ జంట తమ హనీమూన్ ట్రిప్‌కు శ్రీలంకకు వెళ్లారు. అక్కడ ఓ హోటల్‌లో దిగారు. ఇక.. హనీమూన్ అంటే ఎలా ఉంటారు తెలుసు కదా. ఫుల్లుగా మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తోంది ఆ జంట. మద్యం తాగుతుండగా.. ఆ జంటకు ఓ ఆలోచన వచ్చింది. ఈ హోటల్‌ను కొంటే ఎలా ఉంటుంది అని. ఆ హోటల్ అప్పటికే కొంచెం పాతగా ఉందట. దాని లీజు కూడా అయిపోవచ్చిందట. దీంతో దాన్ని లీజుకు తీసుకొని కొత్తగా తీర్చిదిద్దితే ఎలా ఉంటుందనే ఆలోచన తట్టింది ఆ జంటకు. అప్పటికే.. ఫుల్లు మత్తులో ఉన్నారు వాళ్లు. ఏం చేస్తున్నారో కూడా వాళ్లకు తెలియట్లేదు. దీంతో 30 వేల పౌండ్లు పోసి ఆ హోటల్‌ను మూడేళ్లకు తీసుకున్నారు. అంటే మన కరెన్సీలో 29 లక్షల రూపాయలు.

ఇక.. వాళ్ల హనీమూన్ ట్రిప్ కాస్త బిజినెస్ ట్రిప్‌గా మారిపోయింది. అలా ఈసంవత్సరం జులై 1 నుంచి మూడేళ్ల పాటు దాన్ని లీజ్‌కు తీసుకొని.. దానికి లక్కీ బీచ్ తంగళ్లె అనే పేరు పెట్టారు వాళ్లు. దాన్ని అందంగా తీర్చిదిద్దారట. ఇక.. అప్పటి నుంచి టూరిస్టులు ఆ హోటల్‌కు క్యూ కడుతున్నారట. బాగుంది కదా ఐడియా.. తాగితే తాగారు కానీ.. మంచి బిజినెస్ దొరికింది.. అంతే కాదు వాళ్లు ఆ ఏరియాలో సెలబ్రిటీలు అయిపోయారు. సోషల్ మీడియాలో, మేగజైన్లలో వాళ్ల వార్తలే.

View this post on Instagram

How #luckybeachtangalle was born! ❤️

A post shared by Lucky Beach (@luckybeachtangalle) on

7470
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles