శాంతి స్థాపన కోసం చర్చలు జరుగాలి..

Wed,February 27, 2019 08:30 PM

బ్రిటన్ : భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఇంగ్లండ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్రిక్తతలను నిరోధించేందుకు రెండు దేశాలు సంయమనం పాటించాలని ఇంగ్లండ్ ప్రధాని థెరిసా మే కోరారు. శాంతి స్థాపన కోసం చర్చలు జరుపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దౌత్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇరుదేశాలతోనూ తాము సంప్రదింపులు జరుపుతున్నామని, ఈ విషయంపై అంతర్జాతీయ భాగస్వాములతో చర్చిస్తున్నామని థెరిసా మే తెలిపారు. ఆందోళనకర పరిస్థితులను నిరోధించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ద్వారా ప్రయత్నాలు చేస్తామని వెల్లడించారు. రెండుదేశాల్లో పరిస్థితులను తాము ఎప్పటికపుడు తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు.

3306
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles