జవాన్ల కుటుంబాలకు ఎన్నారై సోదరుల కోటి విరాళం

Wed,February 20, 2019 07:14 PM

UAE NRIs donates Crore to families of Pulwama attack martyrs

దుబాయ్: పుల్వామాలో జరిగిన ఉగ్రవాదిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన అమరజవాన్ల కుటుంబాలకు మేమున్నామంటూ విదేశాల్లో ఉన్న భారతీయులు ముందుకొస్తున్నారు. సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు దుబాయ్‌లో భారతసంతతికి చెందిన ఎన్నారై సోదరులు కోటి విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

జెమినీ గ్లోబల్ హోప్ ఫౌండేషన్ ద్వారా ఇద్దరు ఎన్నారై వ్యాపారవేత్తలు కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నారని జెమినీ గ్రూప్ ఎండీ సుధాకర్ రావు తెలిపారు. దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం సహకారంతో సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఈ విరాళం నేరుగా అందజేయాలని దాతలు చెప్పారని సుధాకర్ రావు వెల్లడించారు. మా ట్రస్ట్ నుంచి ఇస్తున్న మొదటి విరాళం ఇదేనని అన్నారు.

1374
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles