గాల్లోనే ఢీకొన్న రెండు ఫైటర్ జెట్స్

Fri,January 18, 2019 05:05 PM

Two Russian Fighter Jets collided mid air over Sea of Japan

టోక్యో: రష్యాకు చెందిన రెండు సుఖోయ్ ఫైటర్ జెట్స్ గాల్లోనే ఒకదానికొకటి ఢీకొన్నాయి. జపాన్ సముద్రంపై ఎగురుతున్న సమయంలో ఈ రెండు సు-34 శిక్షణ విమానాలు ఢీకొన్నట్లు రష్యన్ మిలిటరీ వెల్లడించింది. జపాన్ సముద్ర తీరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఉన్న పైలట్లు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అందులో ఒక పైలట్.. సముద్రంలో ఓ తెప్పపై వెళ్తూ కనిపించాడు. అతడు తన ఎమర్జెన్సీ లైట్ ద్వారా సముద్రంలో ఉన్నట్లు సమాచారం ఇచ్చాడు. అయితే సముద్రంలో బలమైన గాలుల కారణంగా పైలట్‌ను రక్షించే చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, త్వరలోనే అతని దగ్గరికి వెళ్తామని రష్యన్ మిలిటరీ చెప్పింది. ఇతర పైలట్ల జాడ మాత్రం ఇంకా తెలియలేదు. జెట్స్ ఏమయ్యాయన్న దానిపైనా ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఈ ఫైటర్ జెట్స్‌లో ఎలాంటి మిస్సైల్స్ లేవని మాత్రం మిలిటరీ చెప్పింది.

2558
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles