గస్తీ కాస్తుండగా ఇద్దరు పోలీసుల కాల్చివేత

Fri,November 30, 2018 02:58 PM

కొలంబో: శ్రీలంకలో ఇద్దరు పోలీసులను గుర్తు తెలియని దుండుగులు కాల్చి చంపారు. బట్టికలోవా జిల్లాలోని వవునతీవ్ ప్రాంతంలో నలుగురు పోలీసులు గురువారం రాత్రి రోడ్‌బ్లాక్ (నిషేధిత స్థలం)దగ్గర గస్తీ కాస్తున్నారు. కొందరు దుండగులు నలుగురిపై కాల్పులు జరుపగా.. వారిలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారని హోంశాఖ ప్రతినిధి రంజిత్ మడ్డుమా బండారా తెలిపారు. పోలీసుల హత్యఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఇద్దరు పోలీసులు హత్య కేసులో ఎల్టీటీఈ మాజీ డిప్యూటీ లీడర్ కరుణ ప్రమేయం ఉందని తమిళ్ నేషనల్ అలయన్స్ (టీఎన్‌ఏ) అధికార ప్రతినిధి ఎంఏ సుమంథిరన్ ఆరోపిస్తున్నారు.

1127
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles