అరుదైన రెండు తలల పాము.. వీడియో

Tue,September 25, 2018 01:03 PM

Two headed snake seen in America video goes viral

వర్జీనియా: చాలా చాలా అరుదుగా ఉండే రెండు తలల పాము అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో ఉన్న వుడ్‌బ్రిడ్జ్‌లో కనిపించింది. ఆ ఊళ్లోని ఓ ఇంటి పెరట్లో ఇది కనిపించడంతో ఆ ఇంటి యజమానురాలు దాని ఫొటో తీసి వైల్డ్‌లైఫ్ ఎక్స్‌పర్ట్ ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేసింది. అప్పటి నుంచి అది కాస్తా వైరల్‌గా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి రెండు తలల పాము చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుందని హెర్పటాలజీ నిపుణులు చెబుతున్నారు. అక్కడక్కడా కనిపించే కొన్నింటిని కొందరు వ్యక్తులు బందీగా చేసుకుంటారని వాళ్లు తెలిపారు. ఇది అత్యంత అరుదైన విషయమని హెర్పటాలజిస్ట్ జేడీ క్లియోఫర్ చెప్పారు. ఈయన మూడు దశాబ్దాలుగా పాములపై అధ్యయనం చేస్తున్నారు.

తన కెరీర్‌లో ఇలాంటి పామును ఇంత వరకు చూడలేదని ఆయన అన్నారు. ఆ పాము ఆరు నుంచి 8 అంగుళాల పొడువు, రెండు లేదా మూడు వారాల వయసు ఉంటుందని అంచనా వేశారు. ఇది మరికొన్ని రోజులు అటవీ ప్రాంతంలోనే ఉంటే.. మరో జంతువుకు ఆహారంగా మారేదని క్లియోఫర్ చెప్పారు. రెండు తలల పాములు కూడా అతుక్కుపోయి జన్మించే మనుషుల్లాంటివేనని నిపుణులు అంటున్నారు. పిండం కవలలుగా రూపాంతరం చెందడం ప్రారంభించి మధ్యలోనే ఆగిపోతే ఇలా జరుగుతుందని వాళ్లు చెప్పారు. ఇలాంటి పాములను వేరు చేయొచ్చని కూడా స్పష్టంచేశారు.

8445
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles