తల్లి కడుపులోనే కొట్టుకున్న ట్విన్స్.. అల్ట్రాసౌండ్ స్కాన్‌లో గుర్తించిన డాక్టర్లు.. వీడియో

Wed,April 17, 2019 02:02 PM

Twins spotted fighting each other in their mother womb in china

ఇది మరీ ఇంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ యుగం అనుకోలేదు. లేకపోతే ఏంటి.. ఇప్పటికే నేటి తరం పిల్లలతో మనం ఏగలేకపోతున్నాం. వాళ్లకు ఉన్న తెలివిని చూసి తెల్లమొహం వేస్తున్నాం. ఇప్పుడు ఈ ఘటన గురించి తెలిస్తే బిక్కమొహం పెట్టాల్సిందే. ఇద్దరు ట్విన్స్ తల్లికడుపులోనే తెగ కొట్టుకున్నారు. వాళ్లు ఇంకా భూమ్మీదకు కూడా రాలేదు కానీ.. తల్లి కడుపులోనే తెగ కొట్టేసుకుంటున్నారు. లోపల ఇద్దరి మధ్య ఏం బెడిసి కొట్టిందో కానీ.. వాళ్ల తల్లికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తుండగా వాళ్లు కొట్టుకునే దృశ్యాన్ని డాక్టర్లు చూసి షాకయ్యారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వామ్మో వీళ్లు తల్లికడుపులోనే ఇలా ఉంటే బయటికి వస్తే ఏం విధ్వంసం సృష్టిస్తారో? ఈ ఘటన చైనాలో చోటు చేసుకున్నది.

6147
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles