హ‌రికేన్ బీభ‌త్సం.. ట్ర‌క్కు డ్రైవ‌ర్‌ను కాపాడిన లేడీ రిపోర్ట‌ర్‌

Mon,August 28, 2017 04:28 PM

TV reporter helps rescue truck driver from rising flood water live on air

హూస్ట‌న్: హ‌రికేన్ హార్వే హూస్ట‌న్ న‌గ‌రాన్ని ముంచెత్తింది. గ‌త రెండు రోజులుగా ఆ తుఫాన్ ధాటికి న‌గ‌ర‌మంతా జ‌ల‌మ‌యం అయ్యింది. హ‌రికేన్ బీభ‌త్సాన్ని స్థానిక ఛాన‌ల్ కుహు 11 న్యూస్ ఎప్ప‌టిక‌ప్పుడూ అప్‌డేట్ చేసింది. ఆ టీవీకి చెందిన లేడీ రిపోర్ట‌ర్ బ్రాండీ స్మిత్ ఆదివారం న్యూస్ క‌వ‌రేజీకి వెళ్లింది. అయితే ఓ వీధిలో పూర్తిగా నీటిలో చిక్కుకున్న ట్ర‌క్కును చూసిందామె. బ్రిడ్జ్ మీద ఉన్న లేడీ రిపోర్ట‌ర్.. ట్ర‌క్కులో ఉన్న డ్రైవ‌ర్‌ను కాపాడేందుకు ప్ర‌య‌త్నించింది. లైవ్‌లో మాట్లాడుతూ స‌మాచాం ఇవ్వ‌గానే, అక్క‌డ‌కు పోలీసులు రెస్క్యూ బోట్‌తో వ‌చ్చేశారు. సుమారు 10 మీట‌ర్ల లోతులో ట్ర‌క్కు మునిగిపోయి ఉంది. అందులో ఉన్న డ్రైవ‌ర్‌ను కాపాడేందుకు లేడీ రిపోర్ట‌ర్ త‌న విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చింది. రెస్క్యూ బోట్‌తో వ‌చ్చిన పోలీసులు డ్రైవ‌ర్‌ను ర‌క్షించారు. ఒక‌వేళ స‌మ‌యానికి రెస్క్యూ బోటు రాకుండా ఉంటే, నీటి ఉదృతి దారుణంగా పెరిగే అవ‌కాశం ఉంది. అప్పుడు ప‌రిస్థితి మ‌రోలా ఉండేదేమో. లైవ్ రిపోర్టింగ్ చేస్తూనే ట్ర‌క్కు డ్రైవ‌ర్ ప్రాణాలు కాపాడిన స్మిత్‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.1610
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles