హాండ్‌సమ్‌గా ఉన్నావని చెప్పి జాబ్ పోగొట్టుకున్న యాంకర్!

Fri,May 25, 2018 04:36 PM

TV Anchor suspended after she called male colleague handsome in Kuwait

ఓ టీవీ యాంకర్ అతి చొరవ తన జాబ్‌కే ఎసరు పెట్టింది. తోటి ఉద్యోగిని మంచిగా ఉన్నావు, హాండ్‌సమ్‌గా ఉన్నావు.. నీకేందిపో అనడమే తన కొంప ముంచింది. లైవ్ టీవీ షోలో ఈ ఘటన చోటు చేసుకున్నది. దీంతో ఆ యాంకర్‌పై వేటు పడింది. ప్రస్తుతానికి ఆమెను తాత్కాలికంగా సస్పెండ్ చేసినా.. ఈ ఘటనపై దర్యాప్తు అనంతరం ఆమెపై చర్యలు తీసుకోనున్నట్లు టీవీ యాజమాన్యం ప్రకటించింది.

కువైట్‌కు చెందిన ఓ టీవీ చానెల్‌లో ఓ లైవ్ బులెటిన్ నడుస్తున్నది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన బులెటిన్ అది. యాంకర బసిమా ఏఐ షమ్మర్ ఆ షోను రన్ చేస్తున్నది. ఇక.. మున్సిపల్ ఎన్నికల గురించి వివరించడానికి తమ ప్రతినిధి లైన్‌లోకి వచ్చాడు. ఆయన మాట్లాడటానికి ముందు తన తలపాగాను కాస్త అటూ ఇటూ సర్దుకుంటుండగా... దాన్ని సర్దుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు హాండ్‌సమ్‌గానే ఉంటావు కదా అని అరబిక్‌లో చెప్పింది. ఏదో సరదాకు ఆమె నోరుజారిన పదం కాస్త వివాదాస్పదమైంది. ఓ ఎంపీకి ఈ విషయం తెలియడం, ఇలా పబ్లిక్ లో వేరే వ్యక్తిని ఫ్లర్ట్ చేయడమేంటని.. ఈ ఘటనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆమెను వెంటనే విధుల నుంచి బహిష్కరించాలని టీవీ యాజమాన్యానికి హెచ్చరికలు వెళ్లడంతో చేసేదేమి లేక టీవీ యాజమాన్యం తనను విధుల నుంచి తప్పించింది.

"నేను చేసిన తప్పేంటో నాకైతే అర్థం కావట్లేదు. అది జోక్ కాదు.. మరేదో కాదు. తన తలపాగాను సెట్ చేసుకుంటుంటే నువ్వు బాగానే ఉన్నావు కదా. మేమంతా నీ రిపోర్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పాను.." అని ఆ యాంకర్ వాపోయింది.

"నాకైతే ఆమె ఏమన్నదో వినిపించలేదు. నేను నా మైక్ సెట్ చేసుకుంటున్నాను.." అని హాండ్‌సమ్ వ్యక్తి వెల్లడించాడు.


6513
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS