అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో హిందూ మ‌హిళ‌ !

Sat,January 12, 2019 10:04 AM

Tulsi Gabbard, first Hindu lawmaker, announces 2020 presidential run to take on Donald Trump

వాషింగ్ట‌న్: హిందూ మ‌తానికి చెందిన అమెరికా ఎంపీ తుల‌సీ గ‌బ్బార్డ్ .. 2020లో ఆ దేశ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ ప‌డ‌నున్నారు. వైట్‌హౌజ్ రేసులో ఆమె ట్రంప్‌తో పోటీప‌డాల‌ని నిశ్చ‌యించుకున్నారు. దీని కోసం త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. డెమోక్ర‌టిక్ పార్టీకి చెందిన తుల‌సి వ‌య‌సు 37 ఏళ్లు. ఆ పార్టీ నుంచి అధ్య‌క్ష రేసుకు పోటీలో ఉన్న రెండ‌వ మ‌హిళ‌గా ఆమె నిలిచారు. సేనేట‌ర్ ఎలిజ‌బెత్ వారెన్ కూడా వ‌చ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకుంటున్నారు. భార‌త సంత‌తికి చెందిన సుమారు 12 మంది 2020లో ట్రంప్‌కు పోటీ ఇవ్వాల‌నుకుంటున్నారు. దాంట్లో కాలిఫోర్నియా సేనేట‌ర్ క‌మ‌లా హారిస్ కూడా ఉన్నారు. తుల‌సీ గ‌బ్బార్డ్ నాలుగుసార్లు హ‌వాయి నుంచి హౌజ్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్‌కు ఎంపిక‌య్యారు. ఇరాక్ యుద్ధంలో ప‌నిచేసిన ఆమె.. అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ ప‌డుతున్న మొద‌టి హిందూ మ‌హిళ‌గా నిల‌వ‌నున్నారు. చిన్న‌త‌నంలోనే గ‌బ్బార్డ్ హిందూ మ‌తాన్ని స్వీక‌రించారు. ఇండో అమెరిక‌న్ల మ‌ధ్య‌ ఆమె చాలా పాపుల‌ర్‌. ఒక‌వేళ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నికైతే ఆమె మొద‌టి క్రైస్త‌వేత‌ర వ్య‌క్తిగా నిల‌వ‌నున్నారు. వాస్తవానికి అమెరికా జ‌నాభాలో హిందువుల సంఖ్య‌ ఒక శాతం క‌న్నా త‌క్కువే. 2020లోనూ తానే రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున పోటీ చేయ‌నున్న‌ట్లు ట్రంప్ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

3432
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles