ట్రంప్ కామెంట్.. యూఎన్ షాక్..Fri,January 12, 2018 05:08 PM
ట్రంప్ కామెంట్.. యూఎన్ షాక్..

న్యూయార్క్: హైతీ, ఆఫ్రికా దేశాలను కించపరిచే విధంగా కామెంట్ చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల పట్ల ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఒకవేళ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిజమే అయితే, అవి షాక్‌కు గురిచేస్తున్నాయని, చాలా సిగ్గుచేటు అని ఐక్యరాజ్యసమితికి చెందిన మానవహక్కుల సంఘం పేర్కొన్నది. వలసవాద విధానంపై చర్చ జరుగుతున్న తరుణంలో ట్రంప్ ఆఫ్రికా దేశాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ చెత్త దేశాలకు చెందిన వారికి ఎందుకు ప్రవేశం కల్పిస్తున్నారని ఆయన ఆగ్రహించారు. ట్రంప్ వ్యాఖ్యలు అనేక మంది జీవితాలను నాశనం చేసే విధంగా ఉన్నాయని యూఎన్ పేర్కొన్నది. చాలా నీచమైన భాషను ట్రంప్ వాడుతున్నారని ఆరోపించింది. ఇవే వ్యాఖ్యల పట్ల ఆఫ్రికా దేశాలు కూడా స్పందించాయి. ట్రంప్ వ్యాఖ్యలు తీవ్రమైన అభ్యంతరకరంగా ఉన్నాయని ఆఫ్రికా యూనియన్ కూడా రియాక్ట్ అయ్యింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎన్నో సమస్యలు ఉంటాయని, కానీ అగ్రరాజ్యం అమెరికాలోనే దారిద్య్రం ఉన్నదన్న విషయం మరవరాదు అని ఆఫ్రికా యూనియన్ పేర్కొన్నది.

1466
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS