ఎన్నిక‌ల్లో జోక్యం చేసుకోవ‌ద్దు.. పుతిన్‌పై జోకేసిన ట్రంప్‌

Fri,June 28, 2019 05:22 PM

Trump jokes to Putin about Russian election meddling at G20 meeting

హైద‌రాబాద్‌: సెటైర్లు వేయ‌డంలో ట్రంప్‌కు ఎవ‌రూ స‌రిలేరు. జ‌పాన్‌లోని ఒసాకాలో జ‌రుగుతున్న జీ20 స‌ద‌స్సులో పాల్గొనేందుకు వ‌చ్చిన ఆయ‌న‌.. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌పై జోకేశారు. 2016లో జ‌రిగిన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ర‌ష్యా జోక్యం చేసుకున్న‌ద‌ని ఆరోప‌ణ‌లు ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఆ అంశాన్ని పుతిన్ ముందే ట్రంప్ ప్ర‌స్తావించారు. అది కూడా త‌న‌దైన స్ట‌యిల్లోనే. జీ20 మీట్‌లో పాల్గొన్న ఆ ఇద్ద‌రూ ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఆ స‌మ‌యంలో ట్రంప్ త‌న స‌హ‌జ‌మైన రీతిలో పంచ్ విసిరారు. ప్లీజ్‌.. మా ఎన్నిక‌ల్లో జోక్యం చేసుకోవ‌ద్దు అని పుతిన్ వైపు వేలు చూపిస్తూ ట్రంప్ జోకేశారు. అమెరికా ఎన్నిక‌ల్లో ర‌ష్యా జోక్యం చేసుకుంద‌న్న ఆరోప‌ణ‌ల‌పై రాబ‌ర్ట్ ముల్ల‌ర్ ద‌ర్యాప్తు చేసిన నివేదిక‌ను ఇటీవ‌ల‌నే విడుదల చేశారు. అయితే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపేందుకు ర‌ష్యా ప్ర‌య‌త్నించిన‌ట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వాదిస్తున్న‌ది. కానీ ముల్ల‌ర్ రిపోర్ట్‌లో మాత్రం ఎటువంటి ఆధారాలు వెల్ల‌డికాలేదు.1130
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles