విదేశీ టెలికాం సేవ‌ల‌ను వాడొద్దు.. ట్రంప్ ఆదేశం

Thu,May 16, 2019 12:04 PM

Trump declares national emergency over IT threats

హైద‌రాబాద్‌: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ అత్య‌వ‌స‌ర ఆదేశాలు జారీ చేశారు. విదేశీ టెలి సంస్థ స‌ర్వీసుల‌ను వాడ‌రాదు అని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఆదేశంపై ఆయ‌న సంత‌కం చేశారు. విదేశీ టెలికాం సంస్థల స‌ర్వీసుల‌ను వినియోగించ‌డం వ‌ల్ల జాతీయ భ‌ద్ర‌త‌కు ముప్పు ఉంద‌ని ట్రంప్ అన్నారు. అయితే ఆ ఆదేశాల్లో విదేశీ కంపెనీ ఏద‌న్న అంశాన్ని వెల్ల‌డించ‌లేదు. కానీ చైనాకు చెందిన హువావే కంపెనీని టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మా కంపెనీ సేవ‌ల‌ను నిలిపివేయ‌డం వ‌ల్ల అమెరికా క‌స్ట‌మ‌ర్లే న‌ష్ట‌పోతారు అని హువావే సంస్థ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. హువావే ఉత్ప‌త్తుల‌తో చైనా నిఘాకు పాల్ప‌డుతోంద‌ని అనేక దేశాలు ఆరోపిస్తున్న నేప‌థ్యంలో ఈ ప‌రిణామం చోటుచేసుకున్న‌ది. హువావే కంపెనీకి చెందిన 5జీ సేవ‌ల‌ను తిర‌స్క‌రించాల‌ని అమెరికా త‌న మిత్ర‌దేశాల‌ను కోరుతున్న‌ది.

892
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles