హిల్ల‌రీ చేతిలో ఓడిపోతానేమో: ట‌్రంప్‌

Fri,August 12, 2016 12:24 PM

Trump Acknowledges that He could Lose To Hillary

ఓర్లాండో: వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు, దూకుడుగా వ్య‌వ‌హ‌రించే నైజంతో ప్ర‌పంచ దృష్టిని ఆకర్షిస్తున్న అమెరికా అధ్య‌క్ష అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్ తొలిసారి ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డారు. త‌న ప్ర‌త్య‌ర్థి హిల్ల‌రీ క్లింట‌న్ చేతిలో త‌న‌కు ఓట‌మి త‌ప్ప‌దేమో అని ఆయ‌న భ‌య‌ప‌డుతున్నారు. రోజురోజుకూ స‌ర్వేల్లో ఆయ‌న వెన‌క‌బ‌డి పోతున్నారు. అటు రిప‌బ్లిక‌న్ పార్టీలోనే చాలామంది తాము ట్రంప్‌కు మ‌ద్ద‌తివ్వ‌బోమ‌ని తేల్చి చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌త ప్ర‌చార‌కుల స‌భ‌లో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. అమెరిక‌న్లు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించే త‌న తీరును తిర‌స్క‌రిస్తే ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని ఆయ‌న ఆ స‌భ‌లో అన్నారు. మీ మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ప్రాధేయ‌ప‌డ్డారు.

ముఖ్యంగా ఉతాలో స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌గా ఉంద‌ని ట్రంప్ అన్నారు. రిప‌బ్లిక‌న్‌ల‌కు పెట్టని కోట అయిన ఉతాలోనే ట్రంప్‌ను వ్య‌తిరేకించేవారి సంఖ్య పెరుగుతోంది. అందుకే ఆయ‌న మాట‌ల్లోనూ మార్పు వ‌చ్చింది. నెల రోజుల కింద‌ట రిప‌బ్లిక‌న్ల క‌న్వెన్ష‌న్‌లో మ‌నం భారీ మెజార్టీతో గెల‌వ‌బోతున్నామ‌ని చెప్పిన ట్రంప్‌.. తాజాగా ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ‌ట‌మే అందుకు నిద‌ర్శనం. హిల్ల‌రీని సెకండ్ అమెండ్‌మెంట్ మ‌ద్ద‌తుదారులు అడ్డుకుంటారంటూ ప‌రోక్షంగా హింస‌ను ప్రేరేపించేలా మాట్లాడ‌టం, ఇస్లామిక్ స్టేట్ వ్య‌వ‌స్థాప‌కుడు ఒబామానే అంటూ వివాదాస్ప‌ద కామెంట్స్ చేయ‌డం ట్రంప్‌ను మ‌రింత చిక్కుల్లో ప‌డేసింది.

1618
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS