కారును ఢీకొట్టి ఆగకుండా.. ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. వీడియో

Mon,April 16, 2018 03:29 PM

Truck Drags Car For Several Metres While Changing Lanes in Australia

ఈరోజుల్లో యాక్సిడెంట్లు సాధారణమే. కాని.. అవి జరగడానికి కారణం వాహనదారుల నిర్లక్ష్యం. ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో కూడా ఓ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. హైవేపై రైట్ సైడ్ లేన్‌లో వెళ్తున్న ఓ ట్రక్కు... సడెన్‌గా ఎడమ వైపు ఉన్న లేన్‌లోకి మళ్లబోయింది. అయితే.. ఎడమవైపు ఉన్న లేన్‌లో కారు వెళ్తుండటాన్ని ట్రక్కు డ్రైవర్ గమనించకపోవడంతో ట్రక్కు ఆ కారును ఢీకొట్టింది. సరే. ఢీకొట్టిన తర్వాత అయినా ట్రక్కు ఆగాలి. కదా. కాని.. ఆ ట్రక్కు కారును అలాగే రోడ్డు మీద కొంత దూరం ఈడ్చుకుంటూ తీసుకెళ్లింది.

ఈ ఘటనను ట్రక్కు వెనక వస్తున్న ఓ కారు డ్రైవర్ రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు.. ఆ యాక్సిడెంట్‌పై తెగ చర్చిస్తున్నారు. కొంతమంది కారు డ్రైవర్‌ది తప్పు అంటే.. మరి కొంత మంది ట్రక్కు డ్రైవర్‌దే తప్పని వాదిస్తున్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని గీలాంగ్ రింగ్ రోడ్‌లో చోటు చేసుకున్నది.

3294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS