పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖలు

Fri,June 28, 2019 07:23 PM

TRS NRI branches that have started TRS party membership registration

హైదరాబాద్‌ : తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిన్న టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్వత్య నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. పార్టీ తొలి సభ్యత్వాన్ని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ అందుకున్నారు. రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదు నిన్న ప్రారంభం కాగా, ఇవాళ టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాయి. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రచారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మహేష్‌ బిగాల మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీకి తమ వంతు సహాయం చేస్తామన్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ పిలుపు మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖలు తమవంతు కార్యాచరణ మొదలుపెట్టాయన్నారు. రానున్న రోజుల్లో ఎన్నారై సలహాదారు మాజీ ఎంపీ కవిత ఆధ్వర్యంలో వంద వరకు టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖలను విస్తరింపజేస్తామని మహేశ్‌ వెల్లడించారు.

806
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles