సౌతాఫ్రికాలో ఘనంగా ఎంపీ కవిత బర్త్‌డే వేడుకలు

Thu,March 14, 2019 01:47 PM

TRS MP kavitha birth day celebrations in South Africa by TRS NRI

హైదరాబాద్ : నిజామాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జన్మదిన వేడుకలు సౌతాఫ్రికాలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపీ కవిత బర్త్‌డే సందర్భంగా అవయవ దాన కార్యక్రమం చేపట్టారు. టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖలోని సభ్యులందరూ అవయవ దానం చేసేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అవయవ దానంపై విస్తృత అవగాహన కల్పించారు సభ్యులు. ఈ కార్యక్రమంలో నాగరాజు గుర్రాల, నరేందర్ రెడ్డి మాదసాని, నన్నూరి మల్లికార్జున్ రెడ్డి, హరీష్ రంగ, వంశీ వూరు, చక్రపాణి దర్శనం, సాయి కిరణ్ నల్ల, సుఖేష్ అలుగురి, విష్ణు గుండా జై, అరవింద్ ప్రసాద్ చికోటి, నమ రాజేశ్, శ్రీనివాస్ రేపాల, దీపికా జొన్నలగడ్డతో పాటు పలువురు పాల్గొన్నారు.1427
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles