అమెరికాలో టీఆర్‌ఎస్ ప్రచార కార్యాలయం ప్రారంభం

Thu,November 15, 2018 12:01 PM

TRS Mission Campaign Head Quarters Launched in New Jersey

న్యూజెర్సీ: అమెరికాలో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార కార్యాలయం ప్రారంభమైంది. టీఆర్‌ఎస్-యూఎస్‌ఏ కన్వీనర్ శ్రీనివాస్ గంగగోని నాయకత్వంలో టీఆర్‌ఎస్-యూఎస్‌ఏ టీం ఈ ప్రచార కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించింది. టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సమన్వయకర్త మహేశ్ బిగాల స్కైప్ ద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యాలయం ద్వారా ఆసరా పించన్లు, నిరుద్యోగ భృతి, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ సహా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కాల్ క్యాంపేయిన్ వాలంటీర్లు తెలంగాణలోని ఓటర్లకు ఫోన్ కాల్ ద్వారా వివరించనున్నారు. కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీఆర్‌ఎస్-యూఎస్‌ఏ అడ్వైజర్ రవి ధన్నపునేని, మహేశ్ పొగాకు(ఇన్‌ఛార్జి), దేవేందర్‌రెడ్డి(మీడియా ఇన్‌ఛార్జి), రామ్ మోహన్ చిన్నా(న్యూజెర్సీ సిటీ ఇన్‌ఛార్జి), సాయి సోమిశెట్టి, అరుణ్‌మరకల, శ్రీనివాస్, రామ్ మోహన్, సాగర్, మధు, శ్రీకాంత్ పాల్గొన్నారు. జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా వీరంతా పనిచేయనున్నారు.


1464
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles