కేరళకు టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ రూ. లక్ష విరాళం

Wed,August 22, 2018 11:31 AM

TRS Australia wing donates one lakh rupees to flood hit Kerala

హైదరాబాద్ : వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి అన్ని విధాలా ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం లక్ష రూపాయలు తమ వంతుగా ఆర్ధిక సహాయం చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ. 25 కోట్లతో పాటు బియ్యం, పౌష్టికాహారం ఇలా ఎన్నో రకాలుగా అండగా నిలిచింది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ప్రపంచంలోని ఎన్నారైలు స్పందించి తమ వంతుగా సహాయం చేయడం తెలంగాణ బిడ్డలుగా ఎంతో గర్వంగా ఉందని, ఇందుకు కేసీఆర్, అలాగే ఈ విరాళానికి ఆర్థిక సహాయం చేసిన డాక్టర్ అనిల్ రావు చీటీ, డాక్టర్ అర్జున్ చల్లగుళ్ళ, సాయిరాం ఉప్పులకు టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల కృతజ్ఞతలు తెలిపారు.

1414
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles