చెట్టు కూలి 20 మంది విద్యార్థులు మృతి

Mon,March 20, 2017 01:38 PM

కిన్‌టాంపో: ఆఫ్రికా దేశం ఘ‌నాలో విషాదం చోటుచేసుకున్న‌ది. జ‌ల‌పాతం ద‌గ్గ‌ర ఈత కొడుతున్న విద్యార్థుల‌పై ఓ భారీ వృక్షం కూలింది. ఈ ఘ‌ట‌న‌లో 20 మంది విద్యార్థులు మృతిచెందారు. మ‌రో 15 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఘ‌నా దేశంలోని కింటాంపో జ‌ల‌పాతం ద‌గ్గ‌ర ఈ ఘ‌ట‌న జ‌రిగింది. విహార‌యాత్ర‌కు వ‌చ్చిన విద్యార్థులు వాట‌ర్‌ఫాల్స్ ద‌గ్గ‌ర ఈతకు దిగారు. అయితే ఆ స‌మ‌యంలో తుఫాన్ వ‌చ్చింది. ఒక్క‌సారిగా పెనుగాలి రావ‌డంతో అక్క‌డే ఉన్న భారీ వృక్షం విద్యార్థుల‌పై కుప్ప‌కూలింది. ప్ర‌మాద ఘ‌ట‌న వ‌ద్ద ఘ‌నా ఫైర్ స‌ర్వీస్ స‌హాయ కార్యక్ర‌మాలు చేప‌ట్టింది.

2592

More News

మరిన్ని వార్తలు...