ఎవ‌రెస్టు శిఖ‌రంపై ట్రాఫిక్ జామ్‌

Fri,May 24, 2019 11:05 AM

Traffic jam On Mount Everest as 200 trekkers attempt to reach summit

హైదరాబాద్‌: ఎవ‌రెస్టు శిఖ‌రంపై ట్రాఫిక్ జామైంది. ఇది నిజ‌మే. బుధ‌వారం నాలుగ‌వ క్యాంపు వ‌ద్ద ఒక్క‌సారిగా ప‌ర్వ‌తారోహ‌కులు స్తంభించిపోయారు. సుమారు రెండు వంద‌ల మంది ఒకే చోట ఆగిపోయిన‌ట్లు తెలుస్తోంది. బుధవారం ఉద‌యం ఈ ప‌రిస్థితి ఎదురైన‌ట్లు స్థానిక మీడియా వెల్ల‌డించింది. 8848 మీట‌ర్ల ఎత్తు ఉన్న శిఖ‌రాన్ని ఎక్కేందుకు ఈసారి ప‌ర్వ‌తారోహ‌కులు ఎగ‌బ‌డ్డారు. అయితే సుమారు రెండు గంట‌ల పాటు ఒక చోటు ట్రెక్క‌ర్స్ అంతా వేచి ఉండాల్సి వ‌చ్చింది. చాలా వ‌ర‌కు ట్రెక్క‌ర్స్ ఒకేసారి రావ‌డంతో.. ఎవ‌రెస్టు శిఖ‌రంపైకి చేరుకునేందుకు చాలా మంది ఆల‌స్యమైంది. 1953 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 4400 మంది ఎవ‌రెస్టు ప‌ర్వ‌తాన్ని ఎక్కారు. ఈ ఏడాది 381 మంది ప‌ర్వ‌తారోహ‌ణ‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చారు. ఈ మ‌ధ్యే కామి రీటా అనే నేపాలీ చ‌రిత్ర సృష్టించాడు. అత‌ను ఎవ‌రెస్టును 24వ సారి అధిరోహించిన విష‌యం తెలిసిందే.

1986
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles