అమెరికాలో టోర్నడోల బీభత్సం : 14 మంది మృతి

Mon,March 4, 2019 09:17 AM

Tornado Kills 14 In US State Of Alabama

వాషింగ్టన్‌ : అమెరికాలోని అలబామాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ విపత్తు సంభవించడంతో అలబామా అతలాకుతలమవుతోంది. ఈ విపత్తు నేపథ్యంలో 14 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. పలువురు తీవ్రంగా గాయపడగా, మరికొందరు గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. విపత్తు వల్ల విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు ఇండ్లు నేలమట్టం అయ్యాయి. శిథిలాలు రోడ్లపై పడిపోవడంతో రవాణాకు ఆటంకం కలిగింది. 5000 మంది తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

1649
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles