టాప్‌లెస్‌గా మహిళ నిరసన.. ట్రంప్‌కు చేదు అనుభవం!

Sun,November 11, 2018 04:59 PM

Topless female protester runs at US President Donald Trumps motorcade

పారిస్: మొదటి ప్రపంచ యుద్ధం వందేళ్లయిన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు పారిస్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ మహిళ టాప్‌లెస్‌గా ట్రంప్ కాన్వాయ్‌కు అడ్డం తగిలింది. తన ఛాతీపై నకిలీ శాంతిదూత అని రాసుకొని ఆమె నిరసన తెలిపింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి 70 దేశాల నేతల హాజరయ్యారు. ఈ ఘటన అక్కడి భద్రతపై సందేహాలు రేకెత్తించింది. ఈ నిరసన తమ పనే అని పారిస్‌కు చెందిన ఫెమినిస్ట్ గ్రూప్ ఫెమెన్ వెల్లడించింది. సెక్సిజం, రేసిజంలాంటి అంశాలపై ఈ సంస్థ తరచూ నిరసనలు తెలుపుతూ ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించి తాము ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పారిస్ పోలీసులు వెల్లడించారు.

4294
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles