భారీ వర్షాలు.. 179కు పెరిగిన మృతులు

Wed,July 11, 2018 07:57 PM

Toll rises to 179 in flood-related incidents, power and water supply hit

టోక్యో: జపాన్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా కుంభవృష్టి కురుస్తుండటంతో వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 179కు చేరిందని జపాన్ ప్రభుత్వానికి చెందిన ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. వందల సంఖ్యలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు గాయపడ్డారు. 1982 తరువాత జపాన్‌లో వర్షాల కారణంగా భారీ స్థాయిలో ప్రాణనష్టం చోటుచేసుకోవడం ఇదేనని అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. దాదాపు 70 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

సెంట్రల్, వెస్ట్రన్ జపాన్ ప్రాంతాల్లో కుండపోత వర్షాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు దాదాపు 8మిలియన్ల మంది వారి నివాసాలను ఖాళీ చేయాల్సి వచ్చింది. వేలాది ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 2లక్షలకు పైగా గృహాలకు తాగునీరు అందడంలేదు. లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రధాని షింజో అబే ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

3390
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles