కొండచిలువపై కప్పల స్వారీ.. వైరల్ ఫోటో

Thu,January 3, 2019 06:43 PM

ఎట్టెట్టా.. కొండ చిలువపై కప్పలు స్వారీ చేశాయా? అని నోరెళ్లబెట్టకండి. పైన ఫోటో చూశారా? అది దానికి సంబంధించిందే. చూశారుగా.. కప్పలు ఎలా పైథాన్ మీద ఎక్కి స్వారీ చేస్తున్నాయో. పైథాన్ మీద స్వారీ చేసే కప్పలు టోడ్స్ జాతికి చెందినవి. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్నది. అసలు ఆ కప్పలు పైథాన్ మీదికి ఎందుకెక్కాయి. అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకోవాలనుందా?గత ఆదివారం రాత్రి వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని కునునుర్రాలో పెద్ద గాలిదుమారంతో కూడిన వర్షం వచ్చిందట. వర్షం తగ్గాక.. తన ప్రాపర్టీ ఎలా ఉందో చెక్ చేసుకుందామని తన ప్రాపర్టీ సైట్‌లోకి వెళ్లాడు పాల్ మాక్ అనే వ్యక్తి. తనకు ఓ డ్యామ్ ఉందట. వర్షం కురవడంతో మనోడి డ్యామ్ అంతా నీటితో నిండడమే కాదు.. వేల టోడ్స్ కప్పలు అక్కడ చేరాయట. వాళ్ల డ్యామ్‌లోనే ఓ కొండ చిలువ ఉంటుందట. దాని పేరు మోంటీ. అది గడ్డిలో అటూ ఇటూ తిరుగుతుంటే.. ఈ కప్పలు దాని మీదకి ఎక్కాయట. ఒక దాని తర్వాత మరో కప్ప దాని మీదికి ఎక్కి స్వారీ చేశాయట. కొండ చిలువ మాత్రం వరదలను తప్పించుకుంటూ కప్పలను పట్టించుకోకుండా వెళ్తుందట. పైథాన్.. వాటిని తినకుండా.. అవి దాని మీద ఎక్కినా ఏమనకపోవడం మనోడిని ఆశ్చర్యానికి గురి చేసిందట. కప్పలు పైథాన్ మీదికి ఎక్కినప్పుడు పాల్ ఫోటో తీసి దాన్ని తన సోదరుడికి పంపించాడట. అతడి సోదరుడు ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో ఆ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ ఫోటోపై ఫ‌న్నీ కామెంట్స్ పెడుతున్నారు.5654
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles