1991లో దిగిన ఫోటో అది.. వైరలయిన ఒబామా షేర్ చేసిన ఫోటో

Fri,January 18, 2019 03:05 PM

అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరక్ ఒబామా తన పాత ఫోటో ఒకటి షేర్ చేశారు. తన భార్య మిచెల్లే బర్త్‌డే సందర్భంగా వాళ్లిద్దరు కలిసి ఉన్న పాత ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిచెల్లే ఇటీవలె తన 55 వ బర్త్‌డేను జరుపుకున్నది. తన బర్త్‌డేకు డిఫరెంట్‌గా శుభాకాంక్షలు చెప్పాలనుకున్నారో ఏమో.. ఒబామా వాళ్లిద్దరూ కలిసి దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటో 1991లో దిగింది. కెన్యాలోని మొంబాసలో దిగిన ఫోటో అది. వాళ్లిద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరిగినప్పుడు ఆ ఫోటో దిగారు. గత సంవత్సరం కూడా ఇలాగే మిచెల్లే బర్త్‌డేకు ఒబామా వాళ్లిద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు.షేర్ చేసిన క్షణాల్లోనే ఆ ఫోటో వైరల్‌గా మారడమే కాదు.. ట్విట్టర్‌లోనే 1.16 మిలియన్ల లైక్స్ వచ్చాయి. అంటే 11 లక్షల 60 వేల లైక్స్ అన్నమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో 4.6 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఆ ఫోటోను షేర్ చేసి త‌న భార్య‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు ఒబామా. వెంటనే తన భర్తకు థాంక్యూ అంటూ ట్వీట్ చేసింది మిచెల్లే. నెటిజన్లు కూడా ఆ ఫోటోపై స్పందించారు. మిచెల్లేకు బర్త్‌డే విషెస్ చెబుతూనే ఆ ఫోటోను షేర్ చేస్తున్నారు. గత సంవత్సరం డిసెంబర్‌లో మిచెల్లే ఒబామాను అత్యధిక అమెరికన్లు ఆరాధిస్తున్న మహిళగా ఎంపిక చేశారు. గల్లప్ పోల్ ఆధారంగా ఆమెను ఎంపిక చేశారు.


3624
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles