బంక్ సిబ్బంది సమయస్ఫూర్తి.. మంటల నుంచి కాపాడింది.. వీడియో

Fri,July 13, 2018 03:10 PM

Three Wheeler Caught Fire At A Petrol Pump in china

సమయస్ఫూర్తి, సాహసం, దైర్యం, చాకచక్యం... ఇంకా తెలుగులో వీటికి సంబంధించిన ఏవైనా పదాలు ఉంటే కూడా యాడ్ చేయడం బెటర్. ఆ మహిళ ఎంతో తెగువతో పెట్రోల్ బంక్‌లో మంటల్లో చిక్కుకున్న ఆటోను కాపాడింది. అంతే కాదు.. పెట్రోల్ బంక్‌కు కూడా మంటలు అంటుకోకుండా చేయగలిగింది. అసలేం జరిగిందంటే..

చైనాలోని జియాంగ్జిలో ఉన్న ఓ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టించడానికి ఓ ఆటో వచ్చింది. ఆటో మన దగ్గరి ఆటోలా కాకుండా థ్రీ వీలర్ వెహికిల్ అని అంటారు దాన్ని అక్కడ. లగేజి కోసం వాటిని అక్కడ వాడుతుంటారు. ఇటువంటి వాహనాలు ఇదివరకు మన ఇండియాలో ఉండేవి. కాని.. ఇప్పుడు కనిపించట్లేవు. ఇక.. ఆ వాహనానికి పెట్రోల్ కొట్టించిన అనంతరం డ్రైవర్ దాని మీదికి ఎక్కి కూర్చొని దాన్ని స్టార్ట్ చేశాడు. అంతే.. ఒక్కసారిగా దానికి మంటలు అంటుకున్నాయి. దీంతో మిగితా వాహనదారులతో పాటు ఆ డ్రైవర్ కూడా బయపడి వెంటనే అక్కడి నుంచి పారిపోయారు.

కాని.. బంక్‌లో పెట్రోల్ కొట్టే సిబ్బందిలో ఓ మహిళ మాత్రం ఏమాత్రం భయపడకుండా అగ్నిమాపక సాధనంతో మంటలార్పేసింది. వెంటనే మరో మహిళ వచ్చి మంటలు ఆర్పింది. మంటలు అంటుకున్న 12 సెకండ్లలోనే ఆ మహిళ ఆ వాహనానికి అంటుకున్న మంటలను ఆర్పేయడంతో పెట్రోల్ బంక్ సిబ్బంది తన సాహసాన్ని మెచ్చుకున్నారు. ఇక.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆ మహిళపై ప్రశంసల వర్షం కురిపించడంతో పాటు ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.


1382
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles