అస్థిపంజరాన్నే కొట్టేశారు.. వీడియోWed,February 21, 2018 03:42 PM

అస్థిపంజరాన్నే కొట్టేశారు.. వీడియో

ఎవరైనా డబ్బులను కొట్టేస్తారు.. వస్తువులను కొట్టేస్తారు. కాని.. వీళ్లెందిరా బాబు అస్థిపంజరాన్నే కొట్టేశారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని అడెలేడ్‌లోని ఓ మాల్‌లో చోటు చేసుకున్నది. ఈ ఘటన గత సంవత్సరం నవంబర్‌లో జరగగా.. దాన్ని కొట్టేసిన వాళ్ల వీడియోను పోలీసులు ఇప్పుడు రిలీజ్ చేశారు.

ముగ్గురు వ్యక్తులు.. అడెలేడ్‌లోని రండిల్ మాల్‌కు వెళ్లారు. డిస్‌ప్లేలో డ్రెస్ వేసి ఉంచిన ఫైబర్ గ్లాస్ అస్థిపంజరాన్ని దొంగలించారు. అనంతరం లిఫ్ట్ ఎక్కి అక్కడి నుంచి బయటికి వచ్చి బస్సు ఎక్కారు. వీళ్లు అస్థిపంజరాన్ని దొంగలించి వెళ్తున్న వీడియో పోలీసులకు లభించడంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీళ్లను ఎవరైనా గుర్తుపడతారా? అంటూ క్యాప్షన్ పెట్టి ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలయింది. అయితే.. ఆ వ్యక్తులు అస్థిపంజరాన్ని ఎందుకు దొంగలించారనేదే ఎవరికీ అంతుపట్టడం లేదు. దాని ధర కూడా 200 నుంచి 500 డాలర్ల మధ్య ఉంటుందట. ఇక.. నెటిజన్లయితే.. సోషల్ మీడియాలో ఈ వీడియోపై జోక్స్ వేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

2534
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS