మంచు పెళ్లి కూతురు.. ఇంటర్నెట్‌ను బ్రేక్ చేస్తున్న ఫొటో ఇది!

Wed,November 21, 2018 03:21 PM

this Snow Bride in Canada now breaking the internet

టొరంటో: దీపికా, రణ్‌వీర్ పెళ్లి హ్యాంగోవర్ నుంచి ఇక బయటకు వచ్చేయండి. పెళ్లి కూతరు గెటప్‌లో దీపికాను చూసి మురిసిపోయింది చాలు. ఇంటర్నెట్‌ను బ్రేక్ చేయడానికి తాజాగా మరో పెళ్లి కూతురు వచ్చింది. ఇదలాంటిలాంటి పెళ్లి కూతురు కాదు.. మంచుతో చేసిన పెళ్లి కూతురు. దీనిపేరు సడ్డీ జూలియట్. అంటే మన జూలియట్ అని అర్థం. బంగారు నగలు, ఎర్రటి దుపట్టాతో దీనిని అచ్చూ పెళ్లి కూతురులా ముస్తాబు చేశారు. కెనడాలో ఉందీ మంచు పెళ్లి కూతురు. కొన్ని రోజులుగా ఇది సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టించింది. బ్రాంప్టన్‌కు చెందిన జస్సు కింగ్రా ఈ మంచు పెళ్లికూతురును తయారు చేసింది. ఆమెతోపాటు తన ఇద్దరు చెల్లెళ్లు, స్నేహితురాలు దల్జీత్ కలిసి ఈ మంచు పెళ్లికూతురును తయారు చేశారు. ఐదు రోజుల కిందట దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలను ఇషా అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారిపోయాయి. వేల కొద్దీ లైక్స్, కామెంట్స్, రీట్వీట్స్ రావడం విశేషం.
4589
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS