దురదృష్టమంటే ఈ రెస్టారెంట్‌దే.. ఏడాదిలో మూడు కార్లు దూసుకెళ్లాయ్!

Tue,December 4, 2018 12:59 PM

This restaurant in Denver saw third car accident in 2018

డెన్వర్: ప్రపంచంలోనే ఈ రెస్టారెంట్‌ను అత్యంత దురదృష్టమైనదిగా నెటిజన్లు తేల్చేశారు. ఇది అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో ఉన్న డెన్వర్‌లో ఉంది. ఈ రెస్టారెంట్ పేరు హార్నెట్. ఒక్క 2018 ఏడాదిలోనే మూడు కార్లు ఈ రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లాయి. తాజాగా మొన్న శనివారం కూడా అలాంటిదే ఓ ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి తప్పతాగి కారు నడుపుతూ ఈ రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లాడు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఓ బీఎండబ్ల్యూ కారు తమ రెస్టారెంట్‌లోకి దూసుకువచ్చిన ఫొటోను హార్నెట్ రెస్టారెంట్ షేర్ చేసింది. తమ దురదృష్టానికి నవ్వాలో ఏడవాలో తెలియని స్థితిలో హార్నెట్ నిర్వాహకులు ఉన్నారు. ఎందుకంటే రెండు వారాల కిందటే ఇలాంటి ప్రమాదం రెస్టారెంట్‌లో జరిగింది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి మరో కారు ఈ రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఇలాగే మరో కారు రెస్టారెంట్‌లో తలుపులను బద్ధలు కొడుతూ దూసుకురావడం విశేషం.


3039
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS