చాలెంజ్.. ఈ బీర్‌ను ఒక్క బాటిల్ కంటే ఎక్కువ తాగలేరు!

Sun,November 18, 2018 01:57 PM

This over 67 percent alcohol beer is Worlds strongest

లండన్: యూత్‌లో బీర్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. విస్కీ, బ్రాందీ, జిన్, వోడ్కాలతో పోలిస్తే తక్కువ ఆల్కహాల్ శాతంతో చాలా మందిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఎండలు మండే కాలంలో అయితే చల్లటి బీర్ కోసం ఎగబడతారు. ఒక్క సిట్టింగ్‌లో నేను ఆరు బీర్లు తాగుతా.. పది బీర్లు తాగుతా అంటూ ఫ్రెండ్స్‌తో గొప్పలు చెప్పుకునే వాళ్లు కూడా ఉంటారు. కానీ తాము తయారు చేసిన ఈ బీర్ ఒక్క బాటిల్ కంటే ఎక్కువ తాగలేరు అని స్కాట్లాండ్‌కు చెందిన బ్రీమీస్టర్ సవాలు విసురుతోంది. ఈ బీరు పేరు స్నేక్ వెనమ్. పేరుకు తగినట్లే ఇది అన్ని బీర్లకు ముత్తాత లాంటిది. సాధారణంగా బీర్‌లో అత్యధికంగా 8 నుంచి 11 శాతం ఆల్కహాల్ ఉండగా.. ఈ బీర్‌లో ఏకంగా 67.5 శాతం ఆల్కహాల్ ఉంటుంది. దీంతో అసలు ఒక్క బాటిల్ కాదు కదా.. ఈ 275 ఎంఎల్ బాటిల్‌లో ఒక్కసారి 35 శాతం కన్నా ఎక్కువ తాగకూడదని కంపెనీ ఓ హెచ్చరికను ప్రింట్ చేయడం విశేషం.

అంటే దీన్నో విస్కీ లేదా బ్రాందీలాగా తాగాల్సి ఉంటుంది. నిజానికి విస్కీలోనూ 40 నుంచి 45 శాతం మించి ఆల్కహాల్ ఉండదు. గతంలో ఇదే కంపెనీ 65 శాతం ఆల్కహాల్‌తో ఆర్మగెడాన్ అనే బీర్‌ను తీసుకు రాగా ఇప్పుడు దానిని మించిన ఆల్కహాల్ శాతంతో స్నేక్ వెనమ్‌ను తీసుకు రావడం విశేషం. కనీసం రెండు, మూడు బీర్లు తాగితేగానీ నడవదు అనుకునే వాళ్లు ఈ బీర్‌కు దూరంగా ఉండాలని కంపెనీయే వార్నింగ్ ఇస్తున్నది. ఒకవేళ కొనాలనుకున్న వాళ్లకు కూడా ఈ స్నేక్ వెనమ్ బీర్‌ను ఒక బాటిల్ కంటే ఎక్కువ అమ్మకూడదని కంపెనీ నిర్ణయించింది. ఈ బీరు నోటి వరకు వచ్చేలోపే అందులోని ఆల్కహాల్ వాసన మీ ముక్కుపుటాలను అదరగొడుతుంది. అందుకే గట్టిగా ఊపిరి పీల్చుకొని తాగేయడమే. గతంలో ఆర్మగెడాన్ బీర్‌ను తీసుకొచ్చినా.. కంపెనీ చెప్పిన రేంజ్‌లో లేదని యూజర్లు ఫిర్యాదు చేశారు. కానీ ఈ స్నేక్ వెనమ్ బీర్‌పై మాత్రం ఫిర్యాదులు కాదు కదా.. కేవలం హెచ్చరికలే జారీ చేస్తున్నారు

3907
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS