ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్.. 70 వేలు.. స్పెషాలిటీ ఏంటంటే?

Fri,June 21, 2019 05:55 PM

This Japanese burger costs 1,000 dollars

ఒక బర్గర్ ఖరీదు ఎంతుంటుంది చెప్పండి. మా.. అంటే 100 రూపాయలు.. సరే.. 200 వేసుకోండి. పోనీ... 500 వేసుకోండి. మంచి రెస్టారెంట్లలో కొంచెం ఖరీదు ఎక్కువగా ఉంటుందంటారా? ఎంత పెద్ద స్టార్ హోటల్ అయినా.. 1000 రూపాయల కన్నా ఓ బర్గర్ ఖరీదు ఎక్కువగా ఉండదు కదా. కానీ.. ఈ బర్గర్ ఖరీదు మాత్రం 70 వేల రూపాయలు. అవును.. మీరు చదివింది నిజమే. 1000 డాలర్లు దాని ఖరీదు. దీనికి ఓ చరిత్ర కూడా ఉందండోయ్... అది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్ అట. దీన్నే జపనీస్ బర్గర్ అని కూడా పిలుస్తారు.

జపాన్‌లోని టోక్యోలో ఉన్న గ్రాండ్ హయాత్‌లో దీన్ని సర్వ్ చేస్తారు. ఈ బర్గ్‌ర్‌ను తయారు చేయడానికి స్పెషల్ చెఫ్. యూఎస్ చెప్ పాట్రిక్ షిమడా దీన్ని తయారు చేస్తాడు. బంగారు ఆకులతో దీని పైన పూత పూస్తారు. జపాన్‌కు చెందిన వాగ్యు అనే ఎద్దు మాంసం ముక్కలతో ఆ బర్గర్‌ను తయారు చేస్తారు. జపనీస్ చెడ్డర్ చీజ్, పొయ్ గ్రాస్(బాతు లివర్‌తో చేసిన వంటకం) లాంటి పదార్థాలతో దీన్ని వండుతారు. ఈ బర్గర్ ఆర్డర్ చేస్తే.. దాంతో పాటు షాంపైన్ బాటిల్ కూడా ఇస్తారు. దాన్ని తింటూ ఏంచక్కా షాంపైన్ తాగొచ్చు.

గార్లిక్ సాఫ్రన్ సాస్, టమాట, పాలకూర, టమాటా ముక్కలను కూడా ఇందులో కలుపుతారు. ఇందులో కలిపే పదార్థాలు కూడా ఖరీదైనవి కాబట్టే దానికి అంత ఖరీదు. మొత్తానికి ఈ బర్గర్‌ను ఒక్కసారి తింటే రెండు రోజుల దాకా ఇంకేమీ తినక్కర్లేదు కావచ్చు.

2147
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles