ప్రపంచంలో ఎక్కువ జీతాలు ఇచ్చే దేశం ఏదో తెలుసా?

Thu,October 11, 2018 12:40 PM

This is the country where you get a better pay

న్యూయార్క్: ప్రపంచంలో ఎక్కువ జీతాలు ఇచ్చే దేశాలు ఏవి? జీవించడానికి, పని చేయడానికి అత్యంత అనుకూలంగా ఉన్న దేశాలు ఏవి? అంటూ నిర్వహించిన ఓ సర్వే తాజాగా బయటకు వచ్చింది. దీని ప్రకారం ఎక్కువ జీతాలు అందుకుంటున్న ఉద్యోగులు స్విట్జర్లాండ్‌లో అధికంగా ఉన్నట్లు తేలింది. ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, హాంకాంగ్ ఉన్నాయి. ఈ లిస్ట్‌లో ఇండియా ఏడో స్థానంలో ఉండటం విశేషం. ఇక విదేశాలకు వెళ్లడానికి సిద్ధపడిన ఉద్యోగి జీతం సగటున 21 వేల డాలర్ల వరకు పెరిగినట్లు కూడా ఈ సర్వే తేల్చింది.

ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగానికి విదేశాల్లో అయితే మరింత ఎక్కువ మొత్తం ఇస్తారని 45 శాతం మంది అభిప్రాయపడగా, 28 శాతం మంది ప్రమోషన్ కోసం మరో ప్రదేశానికి వెళ్లినట్లు సర్వే వెల్లడించింది. చాలా వరకు వివిధ ఇండెక్స్‌ల్లో టాప్ 5లో ఉండే యూరప్ దేశం స్విట్జర్లాండ్ ఎక్కువ జీతాలు ఇస్తున్న లిస్ట్‌లోనూ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ దేశంలో సగటు వార్షిక సంపాదన 61 వేల డాలర్లుగా ఉంది. అదే ఓ విదేశీ వ్యక్తి ఏడాది సగటు జీతం 203000 డాలర్లుగా ఉన్నట్లు తేలింది. ఇది ప్రపంచ సగటు కంటే రెట్టింపు కావడం విశేషం.

ఇక జీవించడానికి, పని చేయడానికి అనుకూలమైన దేశాల్లో వరుసగా నాలుగో ఏడాది కూడా సింగపూర్ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్, జర్మనీ, కెనడా ఉన్నాయి. ఈ లిస్ట్‌లో స్విట్జర్లాండ్ 8వ స్థానంలో ఉంది. స్విస్‌లో ఖర్చులు అధికంగా ఉండటంతో చాలా మంది ఆ దేశానికి వెళ్లడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఈ సర్వేను హెచ్‌ఎస్‌బీసీ నిర్వహించింది. లింగ సమానత్వంలో ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉండే స్వీడన్.. కుటుంబంతో కలిసి జీవించడానికి ఉత్తమమైన దేశంగగా నిలిచింది. న్యూజిలాండ్, స్పెయిన్, తైవాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

9559
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS