భ్రాంతా లేక నిజమా.. చేతులతో భలే మాయ చేసిందే.. వీడియో

Mon,August 27, 2018 05:32 PM

This confused optical illusion goes viral on social media

అంతా భ్రాంతి యేన జీవితానా బ్రతుకింతేనా.. అంటూ ఏదో సినిమాల పాడినట్టుగా ఇప్పుడు మనం చూసే ఈ వీడియో కూడా అట్లాగే ఉంటది. అది నిజమా.. లేక భ్రాంతా? అసలు ఇలా కూడా చేయొచ్చా.. ఇంకా మీకు ఎన్నో డౌట్లు వస్తాయి ఈ చేతుల మాయ చూస్తే. సరే.. వీడియో చూస్తారా? తర్వాత మాట్లాడుకుందాం.వీడియో చూశారా? వెంటనే మీరు కూడా ట్రై చేస్తున్నారా? ఆగండాగండి. ముందు మొత్తం చదవండి.. తర్వాత ఆ మాయను మీరు కూడా చేద్దురు కాని. సాధారణంగా సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్స్‌ను చాలానే చూస్తుంటాం. కానీ.. ఈ తరహా భ్రాంతి అనేది మాత్రం కొత్తగా ఉంది కదా. ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ ఆగస్టు 22 న పోస్ట్ చేయగా.. వింతైన ఈ స్టంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు 3.3 మిలియన్ వ్యూస్ ఈ వీడియోకు వచ్చాయి. ఇక.. ఈ వీడియోను చూసిన వాళ్లు ఊరికే ఉంటారా? ఇక.. వాళ్లు కూడా తమకు తోచిన విధంగా ఆ మహిళ చేసిన విధంగా చేయబోయారు. కొంతమంది వాళ్లు ట్రై చేసిన వీడియోలను ట్విట్టర్‌లో షేర్ కూడా చేశారు. ఇలా.. ఆ ఆప్టికల్ ఇల్యూషన్ కాస్త సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఇదివరకు కూడా ఇలాగే ఓ ఫోటో నెటిజన్లను తెగ కన్ఫ్యూజ్ చేసింది. ఓ యువకుడిని యువతి హగ్ చేసుకుంటుంది. కుర్చిలో యువకుడు కూర్చుంటాడు. వెనుక నుంచి వచ్చి ఆ యువతి అతడిని కౌగిలించుకుంటుంది. అయితే.. అది కూడా కొంచెం భ్రమ కల్పించేలా ఉండటంతో నెటిజన్లు కన్ఫ్యూజ్ అయ్యారు. అదే కాదు.. సోషల్ మీడియాలో ఇటువంటివి చాలా వచ్చాయి. కానీ.. దీని తరహా రెస్పాన్స్ మాత్రం దేనికీ రాలేదు.
6141
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles