వీడియో: 7 లక్షల వాచ్‌ను దొంగలించడానికి భలే స్కెచ్ వేశారు!

Wed,January 10, 2018 05:07 PM

దొంగలు కూడా మారిపోతున్నారు బాస్. దొంగతనం చేయడం కోసం వాళ్లు కూడా అధునాతన పద్ధతులను ఉపయోగిస్తున్నారు. యూఎస్‌లోని ఫ్లొరిడాలో కొత్త సంవత్సరం సంబురాలు జరుగుతున్న వేళ... ఓ దొంగల ముఠా బీభత్సమైన స్కెచ్ వేసింది. ఓ మాల్‌కు కస్టమర్లలాగా వెళ్లిన ముఠా.. అత్యంత ఖరీదైన రొలెక్స్ లగ్జరీ వాచ్‌ను సింపుల్‌గా దొంగలించింది. దాని ఖరీదు... 11,400 డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ. 7 లక్షలు.


వాచ్ తీసుకుంటున్నట్లు నటించిన వాళ్లు... వాచ్‌ను టెస్ట్ చేయడం కోసమని.. దాన్ని ఓ దుండగుడు చేతికి పెట్టుకున్నాడు. అయితే.. ఇంతలోనే మాల్‌లోపల ఏదో గన్ పేలుడు సౌండ్ వినిపిస్తుంది. దీంతో మాల్‌లోని వ్యక్తులంతా భయంతో బయటికి పరుగులు తీస్తారు. వాళ్లతో పాటు ఈ దుండగులు కూడా వాచ్‌తో జంప్ అవుతారు. తీరా చూస్తే.. ఆ మాల్‌లో గన్ పేలుడు లేదు. ఏదీ లేదు. అదంతా వాచ్‌ను దొంగలించడం కోసం ఆ దుండగుల బ్యాచ్ వేసిన ప్లాన్. తర్వాత అసలు విషయం తెలుసుకున్న మాల్ ఓనర్స్... వెంటనే పోలీసులకు సమాచారం అందించగా... రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగల ముఠా కోసం గాలిస్తున్నారు. ముఠాను పట్టుకోవడం కోసం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోలీసులు షేర్ చేయడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలయింది.

5087
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles