HomeLATEST NEWSThief Struggles To Carry Huge TV After Stealing It

ఫన్నీ దొంగ.. దొంగతనం చేస్తూ తెగ నవ్వించాడు.. వీడియో

Published: Wed,December 19, 2018 05:31 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
దొంగలు కూడా మనుషులే కదా. వాళ్లు దొంగతనం చేయడానికి కూడా ఎంతో కష్టపడతారు. అదేమీ అంత వీజీ పని కాదు కదా. ఎన్నో ప్లాన్లు వేసి.. ఎంతో కష్టపడితేనే దొంగతనాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. లేదంటే దొంగతనం మాట దేవుడెరుగు.. అడ్డంగా బుక్కయిపోయి జీవితాన్ని కోల్పోతారు. ఇలాగే.. ఓ దొంగ దొంగతనం చేయడానికి తెగ ఆయాస పడ్డాడు. పెద్ద టీవీని అయితే దొంగలించాడు కానీ.. దాన్ని కారులో ఎక్కించడానికి మాత్రం అపసోపాలు పడ్డాడు. ఈ ఘటన యూఎస్‌లోని మేరీలాండ్‌లో చోటు చేసుకున్నది. మనోడు ఆ టీవీని కారులో ఎక్కించడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో తెలియాలంటే మాత్రం మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఆ వీడియో చూసి మాత్రం మీరు పడి పడి నవ్వుతారు. ఈ ఘటన ఆ ఇంటి ముందున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దొంగలను గుర్తించడం కోసం ఆ వీడియోను పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అవడమే కాదు.. నెటిజన్లు కూడా ఆ వీడియోను చూసి తెగ నవ్వుకుంటున్నారు.
4478
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology