దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మెక్కి నిద్రపోయాడు..!

Thu,November 23, 2017 03:07 PM

Thief Fall asleep while burgling in a house in scotland

దొంగతనం... పేరుకు చెడ్డ పని అయినా.. దొంగతనం చేసి ఈజీగా డబ్బులు సంపాదించొచ్చనుకుంటారు చాలామంది. కాని.. దొంగతనం కూడా ఎంతో చాకచక్యంగా చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా కొట్టినా.. బతుకు అంతా జైలు జీవితం గడపాల్సిందే. వెనకటికి ఓ సామెత ఉండేది.. దొరికితే దొంగ లేకపోతే దొర అన్నట్లు ఓ వ్యక్తి కూడా ఇలాగే దొంగతనం చేద్దామనుకొని వచ్చి అడ్డంగా బుక్కయ్యాడు.

దొంగతనానికి వచ్చి నిద్రపోయి ఇంటి యజమానులకు అడ్డంగా దొరికిపోయాడు. స్కాట్‌లాండ్‌లోని నార్త్ లనర్క్‌షైర్ రీజియన్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది. అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన ఆ దొంగ.. కిచెన్‌లో కనిపించిన 'పై'ని సగం తినేసి అక్కడే పక్కేసి పడుకున్నాడట. తెల్లారే దాకా లేవలేదట. పొద్దన్నే నిద్ర లేచిన ఇంటి ఓనర్స్ ఆ దొంగను చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారట. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ దొంగ చేతికి బేడీలు వేసి నిద్ర లేపారట.

నిద్ర మత్తు అంతా పోయినాక మనోడు చూస్తే.. చేతులకు బేడీలు వేసి ఉన్నాయట. దెబ్బకు ఖంగు తిన్న ఆ దొంగ దొంగతనం చేయకుండా ఆ ఇంట్లోనే నిద్రపోయిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని తనను తానే తిట్టుకున్నాడట. నిద్ర కోసం కక్రుతి పడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన మనోడి స్టోరీని అక్కడి పోలీసులు ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక.. అంతే, నెటిజన్లు దొంగతనం కోసం పోయి.. ఫుల్లుగా మెక్కి నిద్రపోయిన దొంగపై జాలి చూపిస్తున్నారు.

5353
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS