న‌న్ను చూసి న‌వ్వ‌లేదు.. నాతో పాటు న‌వ్వారు..

Thu,September 27, 2018 04:26 PM

they were laughing with me, not at me, says Donald Trump

న్యూయార్క్: త‌న హ‌యాంలో జ‌రిగిన‌న్ని అభివృద్ధి ప‌నులు గ‌తంలో ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా యూఎన్ అసెంబ్లీ స‌మావేశాల్లో అన్నారు. ఆ ప్ర‌సంగం చేసిన స‌మ‌యంలో స‌భ‌లో ఉన్న‌వారంతా గొల్లుమ‌ని న‌వ్వారు. ఆ ఘ‌ట‌న‌పై కొన్ని మీడియా సంస్థ‌లు.. ట్రంప్‌ను చుల‌క‌న చేస్తూ క‌థ‌నాలు రాశాయి. స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో త‌న ప్ర‌సంగ స‌మ‌యంలో న‌వ్విన‌వారంత త‌న‌ను చూసి న‌వ్వ‌లేద‌ని, త‌న‌తో పాటు వాళ్లూ న‌వ్వార‌ని ట్రంప్ అన్నారు. ఫేక్ న్యూస్ సంస్థ రాసిన వార్త నిజం కాదు అని, మేం అంతా ఆ స‌మ‌యంలో స‌ర‌ద‌గా ఉన్నామ‌ని, తాము సాధించిన అభివృద్ధిని గ‌ర్వంగా చెప్పుకున్నామ‌ని, త‌న టీమ్ కూడా గ‌ట్టి మ‌ద్ద‌తు ఇచ్చింద‌ని ట్రంప్ మీడియా స‌మావేశంలో తెలిపారు. యూఎన్‌లో ట్రంప్ మాట్లాడుతున్న స‌మ‌యంలో అనేక మంది దేశాధినేత‌లు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని ఆ ప్ర‌సంగాన్ని విన్నారు. కొంద‌రు ముసి ముసి న‌వ్వులు న‌వ్వ‌గా, కొంద‌రు మాత్రం గ‌ట్టిగా న‌వ్వారు.

1867
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles